కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు : గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీకి ప్రజా పాలన దరఖాస్తుదారులు బుధవారం భారీగా తరలి వచ్చారు. దీంతో ఆఫీస్లో గందరగోళం నెలకొంది. అడిషనల్ కమిషనర్ అనిసుర్ రషీద్ మాట్లాడుతూ..
బల్దియా వ్యాప్తంగా 12 సెంటర్లలో ప్రజా పాలన దరఖాస్తుల సవరణ, నమోదు ప్రక్రియ కొనసాగుందని తెలిపారు. ఇప్పటి వరకు 502 సవరణలు, చేశామని, కొత్తగా 84 దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని తెలిపారు.