కాజీపేట, వెలుగు : వరంగల్ ఎన్ ఐటీ పేటెంట్లు, స్టార్ట ప్ లను అభివృద్ధి చేయడానికి ఆసక్తిగా ఉందని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి తెలిపారు. శుక్రవారం ఐఐటీ రోపర్ తో వరంగల్ నిట్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోపర్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ప్రాజెక్ట్ పై సంతకాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నిట్ డైరెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు, అధ్యాపకులను కంపెనీలను ప్రారంభించేలా ప్రోత్సాహిస్తామన్నారు.
ఐఐటీ రోపర్ డైరెక్టర్ ఫ్రొఫెసర్ రాజీవ్ అహుజా మాట్లాడుతూ ప్రాథమిక, సాంప్రదాయ ఇంజినీరింగ్ కోర్సులను అధ్యయన ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్లు శిరీశ్ సోనవానే, కేఎస్ రాజ్ మోహన్, సాంరగ్ గుంఫేకర్, ప్యాకల్టీ, స్టూడెంట్స్ పాల్గొన్నారు.