
వరంగల్ వడ్డేపల్లి చెరువులో తేలిన డెడ్ బాడీ
కాజీపేట, వెలుగు: నిట్ బీటెక్ విద్యార్థి చెరువులో శవమై తేలిన ఘటన వరంగల్ లో జరిగింది. హైదరాబాద్ కు చెందిన హృతిక్ సాయి(23) వరంగల్ నిట్ లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇటీవల సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసిన హృతిక్ సాయి.. తక్కువ మార్కులు వస్తు న్నాయన్న ఆందోళనతో గురువారం వరంగల్ లోని వడ్డేపల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా సాయంత్రం డెడ్ బాడీ నీటిలో తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చా రు. పోలీసులు వెళ్లి డెడ్ బాడీని బయటకు తీసి.. నిట్ స్టూడెంట్ గా గుర్తించారు. వెంటనే డెడ్ బాడీని వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. నిట్ సిబ్బందితో పాటు అతడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కాగా మార్కుల విషయంలో మనస్తాపానికి గురై హృతిక్ సాయి ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రచారం జరుగు తుండగా.. మరేదైనా కారణం ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.