వరంగల్‌: ఫ్రిజ్‌లో తాత డెడ్‌ బాడీ

వరంగల్‌: రెండ్రోజుల క్రితం మరణించిన వ్యక్తి బాడీని ఫ్రిజ్‌లో పెట్టి ఉంచిన ఘటన వరంగల్‌ జిల్లాలో వెలుగు చూసింది. పరకాలలోని సగర వీధికి చెందిన ఓ యువకుడు తన తాతతో కలిసి కిరాయి ఇంట్లో ఉంటున్నాడు. రెండ్రోజుల క్రితం అతడి తాత మరణించాడు. అయితే అంత్యక్రియలు చేయడం మానేసి ఆ యువకుడు తన తాత మృతదేశాన్ని ఫ్రిజ్‌లో పెట్టాడు. అయితే వృద్ధుడు మరణించి రెండ్రోజులు కావడంతో దుర్వాసన వచ్చి పక్కింట్లోని వాళ్లు అనుమానం వచ్చి పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఆ ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా ఫ్రిజ్‌లో డెడ్‌బాడీ ఉండడంతో పోలీసులు షాక్ అయ్యారు. దీనిపై ఆ యువకుడిని నిలదీయగా అనారోగ్యంతో తన తాత రెండ్రోజుల క్రితం చనిపోయాడని, డబ్బులు లేక అంత్యక్రియలు చేయలేదని చెప్పాడు. ఏం చేయాలో తెలియక ఫ్రిజ్‌లో ఉంచినట్టు తెలిపాడు. దీంతో పోలీసులు ఆ వృద్ధుడి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ఇది సహజ మరణమా? లేక మరేదైనా జరిగిందా? అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ యువకుడికి మతిస్థిమితం సరిగా లేదని తెలుస్తోంది.