
- కేంద్ర ప్రభుత్వం వెల్లడి
హైదరాబాద్, వెలుగు: వరంగల్ సిటీలోని ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు డెవలప్మెంట్ కు సంబంధించిన ప్రపోజల్ ఏది తమ పరిశీలనలో లేదని కేంద్రం వెల్లడించింది. అయితే, యాదగిరిగుట్ట నుంచి వరంగల్ సెక్షన్ వరకు ఎన్‌హెచ్–163 నాలుగు లేనింగ్‌లో భాగంగా, వరంగల్ సిటీకి నార్త్ వైపున బైపాస్ నిర్మించామని పేర్కొంది.
2020 అక్టోబర్ 1వ తేదీ నుంచి ట్రాఫిక్ కోసం ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ మేరకు గురువారం లోక్ సభలో ఎంపీ కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. వరంగల్ నగరానికి చెందిన అంతర్గత రింగ్ రోడ్డు ప్రాజెక్ట్ అయిన కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని కేంద్రం స్పష్టం చేశారు.