హనుమకొండ, వెలుగు : తెలంగాణ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ 15, -20 రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్‌గా వరంగల్ నిలిచింది. హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో రెండు రోజుల పాటు పోటీలు జరిగాయి. గురువారం హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ హాజరై పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కుస్తీ పోటీలు దేశ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తాయన్నారు.
అంతర్జాతీయ వేదికలపై భారత పతాకాన్ని ఎగరవేస్తున్న రెజ్లర్లను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. ప్రతిభావంతులైన రెజ్లర్లకు అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తామన్నారు. అనంతరం గెలిచిన వారికి సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేశారు. కార్యక్రమంలో డీవైఎస్‌వో అశోక్, తెలంగాణ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ కరీం, ట్రెజరర్ వై.సుధాకర్, బాధ్యులు జైపాల్, సాయిలు, శ్రీనివాస్, రాజేందర్, సతీశ్, రాజు, వంశీకృష్ణ పాల్గొన్నారు.