
గ్రేటర్ వరంగల్, వెలుగు: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషి చేస్తానని కాంగ్రెస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య అన్నారు. గురువారం వరంగల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్‌లో ఆమె మాట్లాడారు. హైదరాబాద్, వరంగల్, భూపాలపల్లి నేషనల్ హై వేను ఇండస్ట్రియల్ కారిడార్‌గా ఏర్పాటు చేసి పరిశ్రమలను నెలకొల్పడానికి కృషి చేస్తానన్నారు. అలాగే రైతుల పొలాలకు నీళ్లు అందించేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటానని తెలిపారు. కాకతీయుల కాలం నాటి గొలుసు కట్టుచెరువుల ద్వారా ప్రతి గ్రామాన్ని సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చారు. 10ఏళ్లుగా కడియం ఫౌండేషన్ సంస్థ ద్వారా సేవలు అందించామని, వాటిని మరింత విస్తృతం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రెసిండెంట్ వేముల నాగరాజు, ప్రధాన కార్యదర్శి బొల్లారపు సదయ్య, బీఆర్ లెనిన్ పాల్గొన్నారు.