సమస్యలను పట్టించుకోవడం లేదంటూ మంత్రిని నిలదీసిన స్థానికులు

వరంగల్ పట్టణ ప్రగతిలో మంత్రి సత్యవతి రాథోడ్ కు నిరసన సెగ తగిలింది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 36 వ డివిజన్ లో పర్యటించిన మంత్రిని సమస్యలపై నిలదీశారు స్థానికులు. ఇందిరానగర్ కాలనీలో సమస్యలపై అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ వారిని సముదాయించేందుకు ప్రయత్నించినా వినలేదు స్థానికులు. దీంతో కల్పించుకున్న మంత్రి… వచ్చిన వినతులను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇందిరానగర్ ప్రాంతంలో రైల్వేగేట్, మరో రైల్వే ట్రాక్ వస్తుండటంతో తాలు ఇళ్ళు కోల్పోవాల్సి వస్తోందనీ… ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి తమను ఆదుకోవాలంటూ మంత్రికి వినతులు సమర్పించారు జనం.