బ్రాండెడ్ పేరుతో నకిలీ పురుగుల మందులు..ఏడుగురు అరెస్ట్.. 78 లక్షల మందులు సీజ్

బ్రాండెడ్ పేరుతో నకిలీ పురుగుల మందులు..ఏడుగురు అరెస్ట్.. 78 లక్షల మందులు సీజ్

వరంగల్ లో  నకిలీ పురుగుల మందు అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రముఖ కంపెనీలతో పేరుతో పురుగుల మందు అమ్ముతున్నట్లు గుర్తించారు . ఈ కేసులో ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మీడియా ముందు ప్రవేశ పెట్టారు. 

ఈ సందర్బంగా మీడియాతో  మాట్లాడిన వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ .. అమాయక రైతులే టార్గెట్ గా ముఠా ఫేక్ బ్రాండ్ పురుగుల మందులు  అమ్ముతోంది.  నిందితుల నుంచి రూ.78 లక్షలు నకిలీ పరుగుల మందులు స్వాధీనం చేసుకున్నాం. నగరంలోని మట్టేవాడకు చెందిన వేద ప్రకాశ్ ఆధ్వర్యంలో రైతులను ముఠా మోసం చేస్తోంది. గడువు తీరిన మందులు తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు రైతులకు అమ్ముతున్నారు. పురుగుల మందు తయారీ మిషన్,రెండు కార్లను కూడా  స్వాధీనం చేసుకున్నాం. 8 మందిని అరెస్ట్ చేశాం.. ఒకరు పరారీలో ఉండగా... మరొక నిందితుడు వేరే కేసులో అరెస్టై  జైల్లో ఉన్నాడు. నిదితులపై గతంలో పోలీస్ కేసులు ఉన్నాయి. నిడితులపై పిడి యాక్ట్ పెడుతున్నాం.. రైతులు పురుగు మందులు , విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలి అని సూచించారు.

ALSO READ | మైనర్కు సిజేరియన్ డెలివరీ చేసిన ఆర్ఎంపీ డాక్టర్..శిశువు మృతి

అలాగే వరంగల్ నగరంలో చైన్ స్నాచింగ్ ముఠాను అరెస్ట్ చేసినట్లు చెప్పారు పోలీసులు..  వేరు వేరు కేసుల్లో నలుగురిని అరెస్ట్ చేశామన్నారు. వారి దగ్గరి నుంచి భారీగా బంగారం , నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.