- చెన్నై యువకుడు అరెస్ట్
- మీడియాకు వివరాలు తెలిపిన వరంగల్ సైబర్ క్రైమ్స్ పోలీసులు
హనుమకొండ, వెలుగు : సైబర్ నేరగాళ్లు కొట్టేసిన డబ్బును తిరిగి వేరే బ్యాంకు అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ చేస్తున్న యువకుడిని వరంగల్ సైబర్క్రైమ్పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్క్రైమ్స్ఏసీపీ విజయ్కుమార్బుధవారం మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. ఆన్లైన్లో పెట్టుబడుల పేరుతో జనాలను తమిళనాడుకు చెందిన కొందరు సైబర్‌నేరగాళ్లు మోసగిస్తూ డబ్బులు కొట్టేస్తున్నారు. ఆ డబ్బును చెన్నైకి చెందిన యువకుడు మరియా బెనెడిక్ట్ కు పంపిస్తుండగా.. విత్‌డ్రా చేసి, క్రిప్టో కరెన్సీ, డాలర్స్‌గా మార్చి తిరిగి సైబర్ ఫ్రాడ్స్ బ్యాంకు అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ చేస్తున్నాడు.
ఇటీవల హనుమకొండకు చెందిన ఓ బాధితుడిని ఇన్వెస్ట్ మెంట్ పేరిట నమ్మించి దాదాపు రూ.33 లక్షల దాకా సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. ఆ డబ్బును బెనెడిక్ట్ అకౌంట్‌కు పంపించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని మంగళవారం చెన్నైలో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. కేసును చేధించిన సీఐ రవికుమార్, ఎస్ఐలు చరణ్, శివకుమార్, ఏఏవో సల్మాన్‌పాషా, సిబ్బందిని ఏసీపీ విజయ్‌కుమార్ అభినందించారు.