నకిలీ విత్తనాల పట్టివేత.. 25 కిలోల పత్తి విత్తనాలు స్వాధీనం

వరంగల్ పట్టణంలో పోలీసులు దాడులు నిర్వహించి నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. ఏపీకి చెందిన రామారావు దగ్గర 25 కిలోల పత్తి విత్తనాలను దేవరుప్పల టాక్స్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఈ విక్రయంలో ఏపీకి చెందిన మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.