న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రాత్రి 12.30 గంటల వరకే : వరంగల్ సీపీ

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రాత్రి 12.30 గంటల వరకే : వరంగల్ సీపీ
  •  వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా

హనుమకొండ, వెలుగు : ఇయర్​ఎండ్, న్యూ ఇయర్​సెలబ్రేషన్స్​ను డిసెంబర్ 31 రాత్రి 12.30 గంటల లోపే ముగించాలని వరంగల్ పోలీస్​ కమిషనర్ అంబర్​ కిశోర్​ ఝా ప్రజలకు సూచించారు. కమిషనరేట్​వ్యాప్తంగా లా అండ్​ఆర్డర్, ట్రాఫిక్, టాస్క్​ఫోర్స్, క్రైమ్స్, షీ టీమ్స్​సిబ్బందితో విస్తృతంగా పెట్రోలింగ్​చేస్తామని, ఎక్కడికక్కడ డ్రంక్​అండ్​డ్రైవ్​టెస్టులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

న్యూ ఇయర్​సెలబ్రేషన్స్​ను ప్రజలంతా కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు సీపీ న్యూ ఇయర్​ వేడుకలపై ఆంక్షలు విధించడంతో పాటు ప్రజలకు పలు  సూచనలు చేస్తూ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సెలబ్రేషన్స్​పేరున ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. 

డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

31 సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర ఈవెంట్లకు పోలీసుల నుంచి తప్పనిసరిగా పర్మిషన్​ తీసుకోవాలని సూచించారు. ఈవెంట్లలో అశ్లీల నృత్యాలు చేస్తే సీరియస్​ యాక్షన్​ తీసుకుంటామని  స్పష్టం చేశారు. ఈవెంట్ల నిర్వహణ ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, సెక్యూరిటీ సిబ్బందిని కూడా నియమించుకోవాలన్నారు.

సెలబ్రేషన్స్​ జరుపుకొనే సమయంలో ట్రాఫిక్​ సమస్యలు, చుట్టుపక్కల ఇండ్ల వారికి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోలీసుల ఆంక్షలను ఎవరైనా అతిక్రమిస్తే వెంటనే స్థానికులు 'డయల్ 100'కు కాల్​ చేయాలని ప్రజలకు సూచించారు.