జనగామ అర్బన్, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల సంరద్భంగా ఏర్పాటు చేసిన జనగామ పోలీస్ స్టేషన్ పరిధిలో చేసిన చెక్‌పోస్టును వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా సీపీ చెక్ పోస్ట్ అధికారులు, భద్రతా సిబ్బందితో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు చెక్‌పోస్టులు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.
జిల్లాలోని చెక్ పోస్టులలో సిబ్బంది నిరంతరం అలర్ట్‌గా ఉండాలన్నారు. అనంతరం తనిఖీలు చేసిన వాహన నమోదు రిజిస్టర్ ను పరిశీలించారు. జనగామ సీఐ రఘుపతి రెడ్డి, ఎస్సై సృజన్ కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.