పోలీస్​ స్టేషన్​ తనిఖీ చేసిన సీపీ అంబర్​ కిషోర్​ ఝా

పోలీస్​ స్టేషన్​ తనిఖీ చేసిన సీపీ అంబర్​ కిషోర్​ ఝా

నల్లబెల్లి, వెలుగు: నల్లబెల్లి పోలీస్​ స్టేషన్​ను గురువారం వరంగల్​ పోలీస్​ కమిషనర్ అంబర్​ కిషోర్​ ఝా  తనిఖీ చేశారు.  డ్యూటీలో హెడ్​ కానిస్టేబుల్​ సాయిలు  మరో ముగ్గురులో కానిస్టేబుల్స్​ ఉండటంతో మిగత వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. 

అనంతరం స్టేషన్ ​పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరాల పనితీరు, కేసుల నమోదు, నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల వివరాలను ఆరా తీశారు.  ఉన్న ప్రతి పోలీస్​నిజాయితీగా పనిచేస్తూ ప్రజలకు సేవలందించాలన్నారు.    నైట్​ పెట్రోలింగ్​ చేస్తూ, సీసీ కెమెరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.