ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి

ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి

రఘునాథపల్లి (లింగాల ఘనపూర్), వెలుగు: పోలీస్ స్టేషన్ లో ప్రజలు ఇచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శనివారం జనగామ జిల్లా లింగాల ఘనపూర్ పీఎస్​ను ఆయన సందర్శించారు. కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సిబ్బందికి వివరించారు. అంతకుముందు సీపీ స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు.