సీపీ ఆకస్మిక తనిఖీ

ఆత్మకూరు, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హనుమకొండ జిల్లా ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కటాక్షాపూర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్ పోస్ట్ సిబ్బంది నిర్వహిస్తున్న తనిఖీల తీరును పరిశీలించి

భద్రతా సిబ్బందితో మాట్లాడారు. తనిఖీ సమయాల్లో అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.  తనిఖీల్లో ఆత్మకూర్ ఇన్​స్పెక్టర్​ క్రాంతి కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.