వరంగల్ : రైతుల ఆత్మహత్యలపై వరంగల్ పోలీస్ కమిషనర్ (సీపీ) ఏవీ రంగనాథ్ వివాదాస్పద కామెంట్స్ చేశారు. గ్రామాల్లో జరుగుతున్న ఆత్మహత్యలు రైతు బలవన్మరణాలు కాదని వ్యాఖ్యానించారు. గుండెపోటు, అనారోగ్యం, ఇతర కారణాలతో చనిపోయిన వారిని కూడా రైతు ఆత్మహత్యలగానే నమోదు చేస్తున్నారని చెప్పారు. గతంలో ఎవరైనా రైతు ఆత్మహత్య చేసుకుంటే లక్ష రూపాయల పరిహారం ఇచ్చేవారని, అందువల్ల రైతు ఆత్మహత్యగా కేసు నమోదు చేసేవాళ్లమన్నారు.
ఇప్పుడు ఒక లక్ష స్థానంలో ఐదు లక్షల రైతుబంధు పథకం అమల్లోకి వచ్చిందని సీపీ రంగనాథ్ వ్యాఖ్యానించారు. రైతు ఎలా చనిపోయినా గతంలో మాదిరిగా రైతు ఆత్మహత్య అని వివరాలు పొందుపరచడం వల్లే.. ఈ సంఖ్య పెద్దగా కనబడుతోందని చెప్పారు. సీపీ రంగనాథ్ కామెంట్స్ రైతు సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.