శాయంపేట, వెలుగు : గంజాయి స్మగ్లర్‌పై వరంగల్ పోలీస్ కమిషనర్ సోమవారం పీడీయాక్ట్ ఉత్తర్వులను జారీ చేశారు. జూన్ 8వ తేదీన భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం గోరు కొత్తపల్లి గ్రామానికి చెందిన గజ్జి సహదేవ్రాజ్ మరో ఇద్దరుతో కలిసి ఆంధ్రప్రదేశ్ నుంచి వరంగల్ మీదుగా మహరాష్ర్టకు రూ.50 లక్షల విలువైన 192 కిలోల గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారు. ఈ సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు.
వారి నుంచి 192 కిలోల గంజాయి, ఒక కారు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సహాదేవ్ రాజ్‌ను కోర్టులో హాజరుపర్చి పరకాల సబ్ జైలుకు తరలించారు. నిషేధిత గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడిన సహా దేవరాజ్ పై వరంగల్ పోలీస్‌కమిషనర్ అంబర్‌కిషోర్‌ఝా పీడీయాక్ట్ కేసు నమోదు చేశారు. పీడీ యాక్ట్ ఉత్తర్వులను నిందితునికి శాయంపేట సీఐ రంజిత్‌రావు, దామెర ఎస్సై కొంక అశోక్ పరకాల సబ్జైల్లో అందజేశారు.