- మాట నిలబెట్టుకున్న వరంగల్ సీపీ
కాజీపేట, వెలుగు: కొన్ని రోజుల కింద ఆటో డ్రైవర్లతో నిర్వహించిన సదస్సులో ఇచ్చిన హామీ మేరకు వరంగల్ పోలీస్‌కమిషనర్ ఆటో డ్రైవర్లకు లెర్నింగ్ లైసెన్స్ లు ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు. వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీ పరిధిలోని ఆటోడ్రైవర్లతో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆటో యూనియన్ నాయకులు కొందరు ఆటో డ్రైవర్లకు లైసెన్స్ లు రాలేదని తెలుపడంతో ఆ వేదికపై ఆటో డ్రైవర్లకు లైసెన్స్ లు ఇప్పిస్తానని సీపీ హామీ ఇచ్చారు.
కాజీపేట ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పరిధిలోని 35 మంది ఆటో డ్రైవర్లకు శుక్రవారం హనుమకొండలోని పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ అంబర్ కిషోర్ ఝా లైసెన్సులు అందజేశారు. కార్యక్రమంలో వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, కాజీపేట ట్రాఫిక్ సీఐ నాగబాబు, ఎస్సై ఉమాకాంత్ పాల్గొన్నారు.