
హనుమకొండ/ శాయంపేట(ఆత్మకూర్), వెలుగు: డిపార్ట్మెంట్మర్యాదలు పెంపొందించేలా పోలీస్ ఆఫీసర్లు పని చేయాలని వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ సూచించారు. కమిషనరేట్పరిధిలోని దామెర, ఆత్మకూర్పోలీస్ స్టేషన్లతోపాటు కంఠాత్మకూర్ చెక్‌పోస్ట్ ను మంగళవారం ఆయన సందర్శించారు. స్టేషన్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు, రికార్డు గదులను పరిశీలించి, ఆయా స్టేషన్ల పరిధిలో జరిగే నేరాలపై ఆరా తీశారు.
స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లు, రోజు ప్రమాదాల సంఖ్య, సిబ్బంది తదితర వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీసులపై ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా పని చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, నేరాల నియంత్రణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయనవెంట ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, ఏసీపీ సతీశ్‌బాబు తదితరులున్నారు.