జర భద్రం.. ఫేక్‌‌‌‌ వెబ్‌‌‌‌సైట్ల పేరుతో కోట్లు కొట్టేస్తుండ్రు

జర భద్రం.. ఫేక్‌‌‌‌ వెబ్‌‌‌‌సైట్ల పేరుతో కోట్లు కొట్టేస్తుండ్రు
  • 150 నేరాల్లో రూ.కోట్లు కొల్లగొట్టిన తమిళనాడు జంట 
  • తెలంగాణలోనే రూ. 3 కోట్లు వసూలు
  • ‘గోల్డ్‌‌‌‌ మ్యాన్‌‌‌‌ సచ్‌‌‌‌, యాం బ్రాండింగ్స్‌‌‌‌’ పేరుతో వెబ్‌‌‌‌సైట్లు

వరంగల్, వెలుగు : తాము చెప్పిన వాటిలో పెట్టుబడి పెడితే గిఫ్ట్‌‌‌‌లు, భారీ లాభాలు వస్తాయంటూ నమ్మించి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఇద్దరిని వరంగల్‌‌‌‌ పోలీసులు అరెస్ట్‌‌‌‌ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్‌‌‌‌ సీపీ అంబర్‌‌‌‌ కిశోర్‌‌‌‌ ఝా సోమవారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... తమిళనాడు రాష్ట్రంలోని తాంబరం పట్టణానికి చెందిన జసిల్‌‌‌‌, ప్రీతి కలిసి ఈజీగా డబ్బులు సంపాదించేందుకు ప్లాన్‌‌‌‌ చేశారు. 

Also Read:-ఇండ్లు కూల్చడమేంటి..?

ఇందులో భాగంగా ‘గోల్డ్‌‌‌‌ మ్యాన్‌‌‌‌ సచ్‌‌‌‌, యాం బ్రాండింగ్స్‌‌‌‌’ పేరుతో ఫేక్‌‌‌‌ వెబ్‌‌‌‌సైట్లను క్రియేట్‌‌‌‌ చేశారు. ఆయా సైట్లలో తాము సూచించిన విధంగా పెట్టుబడి పెడితే రిటర్న్‌‌‌‌ గిఫ్ట్‌‌‌‌లతో పాటు భారీ మొత్తంలో లాభాలు వస్తాయంటూ ప్రచారం చేశారు. మొదట్లో పెట్టుబడి పెట్టిన కొందరు వ్యక్తులకు గిఫ్ట్‌‌‌‌లు ఇచ్చి నమ్మించారు. ఈ క్రమంలో హనుమకొండకు చెందిన ఓ వ్యక్తి నిందితులు సూచించిన వెబ్‌‌‌‌సైట్లలో రూ. 28 లక్షలు పెట్టుబడి పెట్టాడు. తర్వాత ఆ డబ్బులను విత్‌‌‌‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా సాధ్యం కాలేదు. దీంతో మోసపోయినట్లు గ్రహించి వరంగల్‌‌‌‌ సైబర్‌‌‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఏసీపీ విజయ్‌‌‌‌కుమార్‌‌‌‌ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు జసిల్‌‌‌‌, ప్రీతి కలిసి మోసాలు చేస్తున్నట్లు గుర్తించారు. వారు చెన్నైలోని సలయూరు పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌ పరిధిలో ఉన్నట్లు తెలుసుకొని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి జిల్లా కోర్టులో హాజరుపరిచిన అనంతరం సోమవారం వరంగల్‌‌‌‌కు తీసుకొచ్చారు. వీరు దేశవ్యాప్తంగా 150కిపైగా సైబర్‌‌‌‌ నేరాలు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. 

ఒక్క తెలంగాణలోనే 15 మోసాలు చేసి రూ.3 కోట్లు వసూలు చేసినట్లు సీపీ వెల్లడించారు. నిందితులు ఉపయోగించిన రెండు బ్యాంక్‌‌‌‌ అకౌంట్లను నిలిపివేసి, డబ్బులను ఏఏ అకౌంట్లలోకి ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ చేశారన్న విషయంపై ఎంక్వైరీ చేస్తున్నారు. నిందితులను పట్టుకున్న ఇన్‌‌‌‌స్పెక్టర్‌‌‌‌ రవికుమార్, ఎస్సైలు చరణ్‌‌‌‌కుమార్‌‌‌‌, శివకుమార్‌‌‌‌ను సీపీ అభినందించారు.