వరంగల్: బండి సంజయ్ పాదయాత్రను నిలిపివేయాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ప్రజా సంగ్రామ యాత్ర ప్రముఖ్ గంగిడి మనోహర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శలు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్ కు వర్ధన్నపేట ఏసీపీ ఆదేశాలు జారీ చేశారు. జనగామలో కొనసాగుతోన్న బండి సంజయ్ యాత్రను తక్షణమే నిలిపివేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పాదయాత్ర పేరుతో బీజేపీ నాయకులు విద్వేషాలు రెచ్చగొడుతున్నారని పోలీసులు పేర్కొన్నారు.
ధర్మ దీక్ష పేరుతో వివిధ జిల్లాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేస్తూ రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే పాతయాత్రను నిలిపివేస్తూ నోటీసులిచ్చామన్న పోలీసులు... పాదయాత్రను నిలిపివేయకుంటే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.