పోలీసు అధికారులకు అవార్డులు

పోలీసు అధికారులకు అవార్డులు

హనుమకొండసిటీ/ మహబూబాబాద్, వెలుగు: విస్తృత స్థాయిలో మత్తు పదార్థాలను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన వరంగల్ కమిషనరేట్ పోలీస్ అధికారులు రాష్ట్ర డీజీపీ చేతుల మీదుగా రివార్డులు అందుకున్నారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో హైదరాబాద్​లోని డీజీపీ ఆఫీస్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరంగల్ పోలీన్ కమిషనరేట్ పరిధిలో యాంటీ నార్కోటిక్స్ ఆధ్వర్యంలో గంజాయి, మత్తు పదార్థాలను పట్టుకోవడం శ్రమించిన వరంగల్ పోలీస్​ కమిషనరేట్ ఇన్స్ స్పెక్టర్లు కరుణాకర్, సుధాకర్ రెడ్డి, సార్ల రాజు, శ్రీధర్ ను డీజీపీ డా.జితేందర్ రివార్డులను అందజేశారు. అవార్డులు అందుకున్న అధికారులను వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ అభినందించారు. మహబూబాబాద్​ టౌన్​ సీఐ పెండ్యాల దేవేందర్​కూడా ఈ అవార్డును 
అందుకున్నారు.