పోలీసులు క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలవాలి : వరంగల్‍ సీపీ అంబర్‍ కిషోర్‍ ఝా

  •     పోలీస్‍ స్పోర్ట్స్​మీట్ ప్రారంభం

వరంగల్‍, వెలుగు: క్రీడల్లో గెలుపోటములు ముఖ్యం కాదని.. క్రీడాకారుల ప్రతిభ ఏంటో చూడాలని వరంగల్‍ పోలీస్‍ కమిషనర్‍ అంబర్‍ కిషోర్‍ ఝా అన్నారు. హనుమకొండ జవహర్‍లాల్‍ నెహ్రూ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన వరంగల్‍ పోలీస్‍ కమిషనరేట్‍ మూడో స్పోర్ట్స్ అండ్‍ గేమ్స్​మీట్​కు సీపీ చీఫ్​గెస్ట్​గా హాజరై క్రీడాజ్యోతిని వెలిగించి ప్రారంభించారు.

.సీపీ మాట్లాడుతూ.. విధి నిర్వహణల్లో ఎంతో ఒత్తిడి ఉన్నా క్రీడల్లో రాణిస్తున్న పోలీసులు ఇతర క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలవాలన్నారు. పోటీల్లో పాల్గొనడం ద్వారా ఫిట్​నెస్ పెరగడంతో పాటు మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చన్నారు. కార్యక్రమంలో డీసీపీలు రవీందర్‍, రాజమహేంద్ర నాయక్‍, అడిషనల్‍ డీసీపీలు రవి, సురేష్‍ కుమార్‍, జనగామ ఏఎస్పీ పండరీ చేతన్‍, ఏసీపీలు, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు. మూడు రోజులపాటు సాగే ఈ పోటీల్లో 3 జోన్ల పరిధిలోని 12 జట్లు వివిధ అంశాల్లో పోటీ పడుతున్నాయి.