వరంగల్‌లో దారుణం: అప్పుతీర్చమన్నందుకు కత్తులతో దాడి

స్నేహితుడు దేవేందర్ రెడ్డి పరిస్థితి విషమం
ములుగు జిల్లాలో ఘటన

ములుగు, వెలుగు: వరంగల్ ప్రెస్​ క్లబ్ ట్రెజరర్, ఫొటో జర్నలిస్ట్​ బొమ్మినేని సునీల్ రెడ్డి (38) దారుణ హత్యకు గురయ్యాడు. ఇచ్చిన అప్పును తీర్చమని అడిగేందుకు స్నేహితుడు దేవేందర్​రెడ్డి, సునీల్ రెడ్డి వెళ్లగా వారిపై కత్తులతో దాడి జరిగింది. దేవేందర్​రెడ్డి పరిస్థితి కూడా విషమంగా ఉంది. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం.. పస్రాలో బెంగళూరు బేకరీ నిర్వహిస్తున్న దయకు.. వరంగల్‌కు చెందిన ఫైనాన్షియర్​ దేవేందర్​ రెడ్డి రూ.8 లక్షలు అప్పు ఇచ్చాడు. అప్పు తిరిగి చెల్లించే విషయంలో వీరి మధ్య వివాదం చెలరేగింది. అప్పు వసూలు చేసుకునేందుకు దేవేందర్​ రెడ్డి, సునీల్ రెడ్డి పస్రా వచ్చారు. దేవేందర్​ రెడ్డిని మాట్లాడదామని బేకరీ వెనక్కి పిలిచిన దయ, అనుచరులతో కలసి అతడిపై కత్తులతో దాడి చేశాడు. తప్పించుకునేందుకు దేవేందర్​రెడ్డి బయటకు పరిగెత్తాడు. స్నేహితుడి కోసం బేకరీలోకి వెళ్లిన సునీల్ రెడ్డిని ఓ గదిలోకి లాక్కె ళ్లి కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు.. రక్తపు మడుగులో పడి ఉన్న సునీల్ రెడ్డిని గుర్తించారు. తీవ్రంగా గాయపడిన దేవేందర్​ రెడ్డిని మెరుగైన ట్రీట్‌మెంట్ కోసం ఎంజీఎంకు తరలించారు. ఫైనాన్స్​ వ్యవహారమేనా లేక ఇంకేమైనా గొడవలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.

For More News..

ఢిల్లీ అల్లర్లు: ఐబీ ఆఫీసర్​ శర్మ ఫ్యామిలీకి రూ.కోటి సాయం

జూపల్లిని పట్టించుకోని కేటీఆర్.. ఇది రెండోసారి

రైతులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైతు రుణమాఫీ

సోషల్‌‌ మీడియాకు మోడీ గుడ్‌‌బై!