వరంగల్ రైల్వేస్టేషన్లో 50 కేజీల గంజాయి

రాష్ట్రవ్యాప్తంగా గంజాయి రవాణా అధికంగా జరుగుతుంది. గంజాయి రవాణాను అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. గంజాయిని స్మగ్లింగ్ పై పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్న అక్రమ రవాణా మాత్రం ఆపడం లేదు. తాజాగా వరంగల్ రైల్వే స్టేషన్ లో రూ. 50 లక్షల విలువైన 50 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. 

స్పెషల్ డ్రైవ్ లో భాగంగా సెప్టెంబర్ 17 ఆదివారం వరంగల్ రైల్వే స్టేషన్ లో తనిఖీ చేస్తుండగా.. నాలుగు క్లెయిమ్ చేయని బ్యాగ్ లను ఆర్ఫీఎఫ్ అధికారులు గుర్తించారు. ఆ బ్యాగ్ లను వరంగల్ టాస్కఫోర్స్ పోలీసులకు అప్పగించారు. 

ALSO READ: మాదాపూర్ డ్రగ్స్ కేసు.. నవదీప్ పిటిషన్పై విచారించనున్న హైకోర్టు

ఈ సంవత్సరం ఆర్ఫీఎఫ్ సికింద్రాబాద్ డివిజన్ డ్రగ్స్ ను తీసుకెళ్తున్న 49 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని సంబంధిత లా ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఆర్ఫీఎఫ్ సికింద్రాబాద్ డివిజన్ లో 39 సంఘటనల్లో రూ. 11.32 కోట్ల విలువైన మాదక ద్రవ్యాల ఉత్పత్తులను రికవరీ చేశామని వివరించారు.