హోలీ పర్వదినానం నాడు వరంగల్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. దుబాయ్ లో 2024 మార్చి 25న సోమవారం వరంగల్ వాసి తిరుమలేష్ గుండెపోటుతో మృతి చెందాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అతని స్వగ్రామం ఉనికిచర్లలో విషాదఛాయలు అలుముకున్నారు.
కొద్దిరోజుల క్రితమే ఉపాధి కోసం తిరుమలేష్ దుబాయ్ వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డెడ్ బాడీ త్వరగా తెప్పించేలా భారతదేశ ప్రభుత్వం చొరవ చూపాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మృతదేహం కోసం ఎదురు చూస్తున్నారు.