- ఆరుగురికి జైలు శిక్ష, 17మందికి జరిమానా విధించిన వరంగల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్
వరంగల్: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుపడిన వారి పట్ల న్యాయస్థానాలు కఠిన వైఖరిని అవలంబిస్తున్నాయి.శృతి మించిన వారికి జైలు శిక్షలు పడుతున్నాయి. వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికిన ఆరు మందికి వరంగల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ వెంకటేశం జైలు శిక్ష విధించారు. ఒక్కొక్కరికి 2 రోజుల జైలు శిక్ష విధించారు. జైలు శిక్ష పడిన వారిని పోలీసులు పరకాల సబ్ జైలుకు తరలించారు. మరో 17 మందికి 19,500/- రూపాయల జరిమానా విధించారు మేజిస్ట్రేట్.
ఇవి కూడా చదవండి:
శిల్పా చౌదరి బెయిల్ పిటిషన్ 21కి వాయిదా
డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదు.. వేసుకున్న గుడిశెలను కూల్చేశారు
ఆస్పత్రిలో దారుణం..మహిళలకు వేసిన కుట్లు విడిపోయాయి
కత్రినా పెళ్లికి కాస్ట్లీ గిఫ్టులు