
కాశీబుగ్గ (కార్పొరేషన్), వెలుగు :సర్వే సర్వేక్షణ్ – 2024లో గ్రేటర్ వరంగల్ నాలుగో ర్యాంకు సాధించింది. దేశవ్యాప్తంగా టాప్ 100 యూఎల్ బీలు సిటిజన్ ఫీడ్ బ్యాక్ లో సాధించిన స్కోరు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ర్యాంకులు ప్రకటించింది. గ్రేటర్ వరంగల్ కు 33,833 మంది సిటీవాసులు బల్దియా సేవలపై సానుకూలంగా స్పందించి అభిప్రాయాలు తెలిపారు.
దీంతో 4వ ర్యాంకు దక్కించుకుంది. బల్దియా కంటే ముందు వరుసలో ఏపీలోని విజయవాడ, వైజాగ్, మహారాష్ట్రలోని పింప్రి, చించోడ్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.
ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి
సిటిజన్ ఫీడ్ బ్యాక్ లో వరంగల్ సిటీకి 4 వ స్థానం దక్కడం ఆనందంగా ఉంది. మార్చి ఫస్ట్ వీక్ వరకు ఫీడ్ బ్యాక్ ఇవ్వవచ్చు. ఇందులో పెద్ద సంఖ్యలో సిటీవాసులు పాల్గొనాలి. తొలి స్థానం పొందేలా తమ అభిప్రాయాలు తెలపాలి. దీంతో స్వచ్ఛ సర్వేక్షణ్-- – 2024 ఉత్తమ ర్యాంకు సాధనకు ఎంతో దోహదపడుతుంది. – అశ్విని తానాజీ వాకడే, కమిషనర్