విడువని వాన..వదలని వరద

  • మూడ్రోజులుగా వాననీటిలోనే గ్రేటర్​ కాలనీలు 
  • ఇండ్లను ఖాళీ చేసి.. సురక్షితప్రాంతాలకు పబ్లిక్​
  • మరో రెండ్రోజులూ భారీ వర్షాల సమాచారంతో జనాల్లో టెన్షన్‍

వరంగల్‍/హనుమకొండ/జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు : వరంగల్‍ స్మార్ట్​ సిటీ కాలనీలు బుధవారం మూడో రోజు వరద నీటిలోనే ఉన్నాయి. మంగళవారం రాత్రి, బుధవారం కురిసిన భారీ వర్షంతో కాలనీల్లో వదర ఏరులై పారింది. జనాలు నిద్రలేని రాత్రులు గడిపారు. బాధిత కాలనీల సంఖ్య 40 కి చేరింది. అధికారుల లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయించడంతో తాళాలు వేసిన ఇండ్లతో కాలనీలు ఖాళీగా కనిపించాయి. వరంగల్‍ పరిధిలోని సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో వేసిన వేలాది గుడిసెలు నీట మునిగాయి. వరంగల్‍ తూర్పు నియోజకవర్గ రూపురేఖలు మార్చామంటూ.. బీఆర్‍ఎస్‍ నేతలు చెబుతున్న అభివృద్ధి ఇదేనా అని జనాలు సోషల్‍ మీడియాలో మండిపడ్డారు.

హంటర్‍రోడ్‍ లోని ఎన్టీఆర్​ నగర్‍, సాయినగర్‍, సంతోషిమాత కాలనీ, బృందావన్‍ కాలనీలో ఉండే దాదాపు 260 వరకు ఉండే ఇండ్లు పూర్తిగా వరద నీటితో నిండాయి. నగరంలో ముంపు నివారణకు చర్యలు చేపడుతున్నట్లు నగర మేయర్ గుండు సుధారాణి తెలిపారు. కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా తో కలిసి క్షేత్ర స్థాయి లో పరిశీలించారు. ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం అతలాకుతలమైంది. వాజేడు మండలం బొగత జలపాతం ఉధృతంగా ప్రవహించడంతో ఫారెస్ట్ సిబ్బంది సందర్శకులను అనుమతి తాత్కాలికంగా నిలిపివేశారు. - 
 

గోదావరికి భారీ వరద

 రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలో భారీ వరద ప్రవాహం కనిపిస్తోంది. బుధవారం మేడిగడ్డ బ్యారేజీకి 5.11 లక్షల క్యూసెక్కుల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లో ఉండగా 75 గేట్లను తెరిచి నీటినంతా కిందికి విడుదల చేస్తున్నారు. సమ్మక్క సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యారేజీ వద్ద 7.54 లక్షల క్యూసెక్కుల 
ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లో ఉండగా 59 గేట్లను తెరిచి వరదను వదులతున్నారు.