రిపబ్లిక్‌‌‌‌ డే పరేడ్‌‌‌‌కు వరంగల్ స్టూడెంట్‌‌‌‌

మహాముత్తారం, వెలుగు : రిపబ్లిక్‌‌‌‌ డే రోజున ఢిల్లీలో జరగనున్న పరేడ్‌‌‌‌కు భూపాలపల్లి జిల్లా మహాముత్తారం ట్రైబల్‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌ హాస్టల్‌‌‌‌ స్టూడెంట్‌‌‌‌ ఎన్నికయ్యారు. మహదేవ్‌‌‌‌పూర్‌‌‌‌ మండలం పెద్దంపేటకు చెందిన సుధీర్‌‌‌‌ ఎస్టీ హాస్టల్‌‌‌‌లో ఉంటూ జడ్పీహెచ్‌‌‌‌ఎస్‌‌‌‌లో టెన్త్‌‌‌‌ చదువుతున్నాడు. స్పోర్ట్స్‌‌‌‌లో ప్రతిభ చూపుతున్న సుధీర్‌‌‌‌ రిపబ్లిక్‌‌‌‌ డే పరేడ్‌‌‌‌కు ఎంపికయ్యారని వార్డెన్‌‌‌‌ శంకరయ్య తెలిపారు. సుధీర్‌‌‌‌ను ఏటూరునాగారం ఐటీడీఏ పీవో అంకిత్, డీడీ పోచం, ఏటీడీవో దేశీరాంనాయక్‌‌‌‌, జడ్పీహెచ్‌‌‌‌ఎస్‌‌‌‌ టీచర్లు పాల్గొన్నారు.