- వరంగల్జిల్లాలో ఇద్దరు స్మగ్లర్లు అరెస్ట్
- పరారీలో మరో ఐదుగురు
- 68 కిలోల గంజాయి స్వాధీనం
హనుమకొండ, వెలుగు: ప్లాస్టిక్కుర్చీల చాటున ఒడిశా నుంచి ముంబైకి గంజాయిని స్మగ్లింగ్చేస్తున్న ఇద్దరు యువకులను వరంగల్టాస్క్ ఫోర్స్, దేవరుప్పుల పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 68 కిలోల గంజాయి, మూడు సెల్ఫోన్లు, ట్రాలీఆటో స్వాధీనం చేసుకున్నారు. మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారు. టాస్క్ఫోర్స్ఏసీపీ మధుసూదన్, ఎస్ బీ ఏసీపీ ఎం.జితేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం పెద్దరామపురం గ్రామానికి చెందిన కమార్తపు వినయ్, ఏసుకూరు మండలం అరికాయలపాడుకు చెందిన బొమ్మ వేణు ఇద్దరూ ఫ్రెండ్స్. ఈజీ మనీ కోసం ఇద్దరూ ఐదేండ్ల నుంచి గంజాయి స్మగ్లింగ్చేస్తున్నారు. ఒడిశాకు చెందిన జగన్, ముద్ద రామారావు అనే వ్యక్తుల నుంచి గంజాయి కొని ముంబైలోని కళ్యాణి రాథోడ్, నావీద్, సాధిక్‌కు ఎక్కువ ధరకు అమ్ముతూ వస్తున్నారు. ఎప్పటిలాగే జగన్, రామారావు నుంచి 68 కిలోల గంజాయిని తీసుకుని 31 ప్యాకెట్లుగా తయారుచేశారు. ఓ ట్రాలీ ఆటోలో ‘పుష్ప’ సినిమా తరహాలో చాంబర్లు ఏర్పాటు చేశారు. వాటిలో గంజాయి ప్యాకెట్లు పేర్చి, పైన ప్లాస్టిక్ కుర్చీలు అమర్చారు. ప్లాస్టిక్ కుర్చీల వ్యాపారం చేస్తున్నట్టుగా నటిస్తూ ఒడిశా నుంచి ఖమ్మం, తొర్రూరు, కొడకండ్ల, జనగామ మీదుగా మహారాష్ట్ర వైపు వెళ్తుండగా.. టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దేవరుప్పుల మండలం మొండ్రాయి సమీపంలో పోలీసులు వెహికల్‌ను ఆపి చెక్‌చేశారు. చాంబర్లలో దాచి స్మగ్లింగ్చేస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకుని, వినయ్, వేణును అరెస్ట్ చేశారు. మిగిలిన ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు వినయ్‌పై గతంలో రెండు కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఆలేరులో హాష్‌ఆయిల్, చౌటుప్పల్‌లో గంజాయి
యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు, చౌటుప్పల్‌లో పోలీసులు స్మగ్లర్ల నుంచి హాష్‌ఆయిల్, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్జిల్లా గూడూరుకు చెందిన అజ్వీరా సూర్య ప్రైవేట్ఉద్యోగి. కరోనా టైంలో జాబ్పోవడంతో నాటు సారా తయారుచేసి విక్రయించడం మొదలు పెట్టాడు. గతేడాది గూడూరు ఎక్సైజ్పోలీసులకు చిక్కడంతో పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపారు. జైలులో సూర్యకు రాము అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. విడుదలయ్యాక ఇద్దరూ కలిసి హాష్ఆయిల్కొని విక్రయించడం మొదలుపెట్టారు.
ఒడిశాలోని మల్కాన్గిరికి లక్ష్మణ్ అనే వ్యక్తి వద్ద హాష్ఆయిల్కొని రాష్ట్రంలో అమ్ముతున్నారు. సూర్య ఎప్పటిలాగే ఒడిశాలో 3 లీటర్ల హాష్ఆయిల్కొని శుక్రవారం వరంగల్‌కు తీసుకొచ్చాడు. అక్కడి నుంచి బైక్‌పై హైదరాబాద్‌కు బయలుదేరాడు. ఆలేరు వద్ద భువనగిరి ఎస్ఓటీ, ఆలేరు పోలీసులు సూర్యను అదుపులోకి తీసుకున్నారు. 3 లీటర్ల హాష్ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఏపీ మహారాష్ట్రకు తరలిస్తున్న నాలుగు కిలోల గంజాయిని చౌటుప్పల్ పంతంగి టోల్‌ప్లాజా వద్ద పోలీసులు పట్టుకున్నారు.
మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన జవేర్, ప్రమోద్, అజినోత్ఏపీలో గంజాయి కొని మహారాష్ట్రలో అమ్ముతున్నారు. శుక్రవారం కారులో తరలిస్తున్న నాలుగు కిలలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని, నిందితులను అరెస్ట్‌చేశారు.