- రూ.2.3 లక్షల విలువైన 115 బండిల్స్ స్వాధీనం
హనుమకొండ, వెలుగు : చైనా మాంజా అమ్ముతున్న షాపులపై వరంగల్ టాస్క్‌ఫోర్స్ ఆఫీసర్లు కొరఢా ఝుళిపించారు. వివరాల్లోకి వెళ్తే.. కాజీపేట పీఎస్ పరిధిలోని విష్ణుపురి కాలనీలో కొందరు వ్యాపారాలు చైనా మాంజాలు అమ్ముతున్నారు. విషయం తెలుసుకున్న వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు.
నిషేధిత మాంజాలు అమ్ముతున్న శనిగరపు అరవింద్, ఎండీ. ఇస్సాక్, మంద శ్రీనాథ్, ఎండీ.సల్మాన్‌ను అరెస్టే చేసి, వారి వద్ద నుంచి రూ. 2.3 లక్షల విలువైన 115 బండిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులతో పాటు మాంజా బండిళ్లను కాజీపేట పోలీసులకు అప్పగించారు. తనిఖీల్లో టాస్క్‌ఫోర్స్ సీఐ ఎం.రంజిత్‌కుమార్, ఎస్సై వి.దిలీప్ ఉన్నారు.