వరంగల్ జిల్లాలో ఎక్స్​పైరీ డేట్ లేకుండానే సేల్స్

హనుమకొండ, వెలుగు : ఎలాంటి తయారీ, ఎక్స్​ పైరీ డేట్​ లేకుండా ఖారా, బూందీ, ఇతర ఆహార పదార్థాలు అమ్ముతున్న షాప్​ పై వరంగల్ టాస్క్​ ఫోర్స్​పోలీసులు రైడ్​ చేశారు. రూ.48 వేల విలువ చేసే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇలా.. వరంగల్ ఎస్ఆర్ఆర్​ తోటకు చెందిన ప్రిన్స్​ మువేంద్ర సన్ బ్రాండ్​ పేరున ఖారా, బూందీ, చెకోడి ఇతర పిండిపదార్థాలు తయారు చేస్తూ నగరంలోని బెకరీలు, కిరాణ షాపులకు సరఫరా చేస్తున్నాడు.

సరైన లైసెన్స్​ లేకపోవడంతోపాటు తయారీ, ఎక్స్​పైరీ డేట్​ లేకుండానే వాటిని ప్యాక్​ చేసి అమ్ముతున్నాడు. సమాచారం అందుకున్న టాస్క్​ ఫోర్స్​ పోలీసులు ఫుడ్​ ఇన్​స్పెక్టర్​ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టి రూ.48 వేల విలువైన సరుకును సీజ్​ చేశారు. తనిఖీల్లో  టాస్క్​ఫోర్స్‌ సీఐ ఎం.రంజిత్, ఎస్సై వి.దిలీప్, వరంగల్ జిల్లా ఫుడ్ ఇన్​స్పెక్టర్  రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కాగా, గురువారం రాత్రి హనుమకొండ రెడ్డిపురానికి చెందిన రెక్స్​ రూబెన్​ నడిపిస్తున్న ఏవీడీ స్వీట్స్​ కంపెనీలో కూడా తనిఖీలు చేసి రూ.74,280 విలువైన ఖారా, చెకోడీ, పల్లీపట్టీలను సీజ్​ చేశారు.