టెక్నాలజీ సెంటర్​తో ట్రాఫిక్, డ్రైనేజీ సమస్యలకు చెక్

  • వరంగల్ ఎన్ఐటీతో ఒప్పందం చేసుకోనున్న జీహెచ్ఎంసీ

హైదరాబాద్ సిటీ, వెలుగు : సిటీలో ట్రాఫిక్ రద్దీ, డ్రైనేజీ నిర్వహణ సవాళ్లను ఎదుర్కొనేందుకు వరంగల్ ఎన్ఐటీ సహకారంతో అత్యాధునిక టెక్నాలజీ సెంటర్ ను  ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ ప్లాన్ చేస్తున్నది. ఈ మేరకు ఎన్ఐటీతో ఒప్పందం చేసుకోనుంది. సిటీలోని ట్రాఫిక్, వరదలు, నాలాల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులు అధ్యయనం చేసి ఈ సెంటర్ కు వివరాలు అందించనున్నారు.

ఈ సమాచారంతో డ్రైనేజీ నెట్‌వర్క్​పై సమగ్ర అధ్యయనాన్ని చేస్తారు. ఎన్ఐటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటే ఎప్పటికప్పుడు సమస్యలకు చెక్ పెట్టే అవకాశముంది. ఇదే విషయమై జీహెచ్ఎంసీ హెడ్​ఆఫీస్​లో శనివారం జరిగిన సమావేశంలో కమిషనర్ ఇలంబరితి మాట్లాడారు.

జీహెచ్ఎంసీ, ఎన్ఐటీ ఒప్పందానికి సంబంధించి విధివిధాలు రూపొందించాల్సి ఉందన్నారు. నిరంతర కార్యకలాపాలు జరిగేలా నిర్మాణాత్మక ఒప్పందం కుదుర్చుకోవాలని వరంగల్ ఎన్ఐటీకి చెందిన ప్రొఫెసర్ ప్రసాద్ సూచించారు. ప్రాజెక్టు సీఈ దేవానంద్, మైంటనేన్స్ సీఈ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.