వరంగల్​టెక్స్ టైల్​పార్కు ముంపు సమస్యకు చెక్ ..!

  • రూ.150 కోట్లతో డైవర్షన్​ చానెల్స్​నిర్మాణానికి సీవోటీ ఓకే

హైదరాబాద్, వెలుగు: వరంగల్​టెక్స్​టైల్​ పార్కు ముంపు సమస్యను తీర్చేందుకు మార్గం సుగమం అయింది. టెక్స్​టైల్​పార్కు మధ్య నుంచి పారుతున్న వాగు ముంపును అరికట్టేందుకు గైడ్​బండ్స్​, డైవర్షన్​చానెల్స్​నిర్మాణానికి ఇరిగేషన్​ శాఖ టెక్నికల్ సపోర్ట్​ను అందించనుంది. దీనికి సంబంధించి పరిశ్రమల శాఖ.. ఇరిగేషన్​ శాఖను కోరడంతో పూర్తి టెక్నికల్​సపోర్ట్​ను ఇచ్చింది.

ఈ క్రమంలోనే వాటి కోసం రూ.150 కోట్లతో టెండర్లకు కమిషనర్​ఆఫ్ టెండర్స్(సీవోటీ)లో ఆమోదం తెలిపారు. శుక్రవారం జరిగిన మీటింగ్​లో వాగు ముంపును తగ్గించే పనులకు ఓకే చెప్పారు. దేవాదుల లిఫ్ట్​ స్కీమ్​లోని పలు పనులకు సంబంధించిన ఎవాల్యుయేషన్​లో తప్పులుండడంతో కరెక్ట్​ చేసేందుకు తిప్పి పంపించారు.