అమెరికాలో వైభవంగా అంజన్న విగ్రహ ప్రతిష్ట జరిగింది. డెలవేర్ రాష్ట్రంలోని హాకెన్‌సిన్ టౌన్‌లో సోమవారం 25 అడుగు హనుమాన్ విగ్రహాన్ని సోమవారం నాడు శాస్త్రోక్తంగా పూజలు చేసి ప్రతిష్టించారు. వేదపండితులు యంత్ర, ప్రాణ ప్రతిష్ఠలు చేశారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కొద్ది మంది భక్తులతోనే విగ్రహ ప్రతిష్ట మహోత్సవం నిర్వహించినట్లు చెప్పారు డెలవేర్ హిందూ టెంపుల్స్ అసోసియేషన్ పతిబంద శర్మ. ఈ హనుమాన్ విగ్రహాన్ని తెలంగాణలోని వరంగల్ నుంచి అమెరికాకు తీసుకుని వచ్చినట్లు చెప్పారాయన.
వరంగల్‌లో సంవత్సరం రోజులు..
ఈ హనుమాన్ విగ్రహాన్ని చెక్కడానికి ఏడాది పైగా సమయం పట్టింది. వరంగల్‌లో పలువురు శిల్పులు కలిసి గ్రానైట్ రాతిని 25 అడుగుల హనుమాన్ విగ్రహంగా మలిచారు. వరంగల్ నుంచి న్యూయార్క్ వరకు నౌక ద్వారా తీసుకుని వెళ్లి అక్కడి నుంచి డెలవేర్‌కు ట్రక్‌పై ఉంచి తరలించారు. 45 టన్నుల బరువు ఉన్న ఈ విగ్రహ తయారీ, రవాణాకు దాదాపు రూ.75 లక్షలకు పైగా ఖర్చయిందని తెలుస్తోంది.
US: A 25 feet tall statue of Lord Hanuman has been installed in Hockessin, Delaware. Patibanda Sharma, President, Hindu Temple of Delaware Association says, “It weighs around 45 tonnes. It has been shipped from Warangal, Telangana to Delaware.” pic.twitter.com/KlWIEgKRCX
— ANI (@ANI) June 16, 2020