లోవోల్టేజీ లేకుండా విద్యుత్ అందించాలి : అశోక్

లోవోల్టేజీ లేకుండా విద్యుత్ అందించాలి : అశోక్

ఆర్మూర్, వెలుగు:  లోవోల్టేజీ సమస్య లేకుండా సబ్ స్టేషన్ ల ద్వారా నిరంతర విద్యుత్ అందించాలని వరంగల్​ ట్రాన్స్​ కో సీజీఎం, నోడల్ ఆఫీసర్ బి.అశోక్​ అన్నారు. బుధవారం ఆర్మూర్, కమ్మర్ పల్లి, నాగాపూర్ లోని సబ్ స్టేషన్ లను ఆయన పరిశీలించి సబ్ స్టేషన్​ ల ద్వారా అందిస్తున్న విద్యుత్​ సరఫరాపై ఆరా తీశారు. వ్యవసాయ వినియోగదారులకు అదనపు బ్రేకర్​, లైన్లో కంట్రోల్ ఏబీ స్విచ్​లు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ సిబ్బంది ఫీల్డ్ లెవల్ లో అందుబాటులో ఉండాలని, నిరంతరం విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. ట్రాన్స్ కో ఎస్​ఈ రవీందర్, ఆర్మూర్ డీఈ హరిచంద్, ఏడీ శ్రీధర్, ఏఈలు బాలరాజు, మనీషా, ఆశ్రిత సిబ్బంది పాల్గొన్నారు. 

నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేయాలి

లింగంపేట: విద్యుత్​ సిబ్బంది స్థానికంగా ఉంటూ వినియోగదారులకు నిరంతరాయంగా కరెంట్​ను సరఫరా చేయాలని జిల్లా ట్రాన్స్‌ కో  ఎస్‌ఈ రమేశ్ బాబు సూచించారు.  లింగంపేట మండలంలోని పోతాయిపల్లి, లింగంపేట లోని 33/11కేవీ సబ్​స్టేషన్​లను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.  సబ్​స్టేషన్‌లలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ ఫార్మర్‌‌లను పరిశీలించారు.  వినియోగదారులకు నాణ్యమైన కరెంట్​ను అందించాలని, ఏవైనా సాంకేతిక సమస్యలు వస్తే వాటిని వెంటనే పరిష్కరించాలని చెప్పారు.