బీఆర్ఎస్ నేతలు నా భూమిని కబ్జా చేశారు.. సెల్ టవర్ ఎక్కిన బాధితుడు

బీఆర్ఎస్ నేతలు తన భూమిని కబ్జా చేశారని  కనుకుంట్ల తిలక్ అనే వ్యక్తి సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. తన సమస్య పరిష్కారం కాకపోతే.. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని బాధితుడు బెదిరించాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి అమాయక ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. ప్రభుత్వ పథకాల కోసం కాదు.. తాను కష్టపడి సంపాదించుకున్న భూమిని తనకు ఇప్పించాలని డిమాండ్ చేశాడు. 

వరంగల్ తూర్పు కోటలో పెట్రోల్ బాటిల్ తో భూకబ్జా బాధితుడు కనుకుంట్ల తిలక్  సెల్ టవర్ ఎక్కాడు. 37 వ డివిజన్ కు చెందిన కనుకుంట్ల తిలక్.. తన భూమిని బీఆర్ఎస్ నేతలు కబ్జా చేశారని ఆరోపించాడు. వరంగల్ లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ అక్కడకు రావాలని డిమాండ్ చేశాడు. అరగంటలో మంత్రి కేటీఆర్ రావాలని లేకపోతే పెట్రోల్ పోసుకుని సూసైడ్ చేసుకుంటానని సెల్ఫీ వీడియో తీసి డిమాండ్ చేశాడు. 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితునికి  పోలీసులు, స్థానికులు నచ్చజేప్పే ప్రయత్నం చేశారు.