
వరంగల్ పశ్చిమ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ నామినేషన్ ను రిజెక్ట్ చేయాలని బీజేపీ అభ్యర్థి రావు పద్మారెడ్డి భర్త, అడ్వొకేట్ రావు అమరేందర్ రెడ్డి రిటర్నింగ్ ఆఫీసర్‌కు కంప్లైంట్ చేశారు. వినయ్ భాస్కర్ ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు వివరాలు అందించారని ఆర్వో రమేశ్‌కు ఫిర్యాదు చేశారు. వినయ్ గతంలో ఎదుర్కొన్న ఓ కేసుకు సంబంధించి కట్టిన ఫీజు వివరాలు తప్పుగా అందించారని అమరేందర్ ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే తప్పుడు వివరాలు అందించినందుకు వినయ్ భాస్కర్ నామినేషన్ తిరస్కరించాలని కోరారు. ఈ మేరకు కోర్టు జడ్జిమెంట్కాపీలను కూడా కంప్లైంట్‌కు జతపరిచారు. కాగా నామినేషన్ ను పరిశీలించిన అధికారులు.. వినయ్ భాస్కర్ నామినేషన్ సక్రమంగా ఉందని ప్రకటించారు. ఈ విషయంపై కోర్టుకు వెళ్తామని అమరేందర్ రెడ్డి చెప్పారు.