బీఫాం అందుకున్న వినయ్‌ భాస్కర్‌

వరంగల్‌, వెలుగు : వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ క్యాండిడేట్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌ బీఫాం అందుకున్నారు. ఆయనకు ఆదివారం హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ బీఫాం అందజేశారు. ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బీఫాం అందజేసిన సీఎం కేసీఆర్‌, వర్కింగ్‌ కమిటీ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు థాంక్స్‌ చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.