కాంగ్రెస్ తోనే వరంగల్ అభివృద్ధి జరుగుతుందని చెప్పారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. ఎంజీఎం ఆసుపత్రిలో జరిగిన చిన్న ఘటనను పెద్ద భూతద్దంలా చూపిస్తున్నారని.. కరెంటు పోవడం ప్రకృతి వలన జరిగిన ఘటన అని చెప్పారు. దీనిపై పూర్తి విచారణ జరుగుతుందని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఎంజీఎం బాగుపడిందని వెల్లడించారు.
గతంలో కాంగ్రెస్ ఎంజీఎం సమస్యలపై ధర్నా చేసిన బీఆర్ఎస్ పట్టించుకోలేదన్న ఎమ్మెల్యే నాయిని.. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఎంజీఎం గురించి మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంజీఎంలో పేషంటును ఎలుకలు కోరికిన ఘటన, మిషనరీ పాడైన ఘటనలు గుర్తు లేవా అని ప్రశ్నించారు.
వరంగల్ కు కేటీఆర్ ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలేదని మండిపడ్డారు. వరదలు వచ్చినప్పుడు ఇంటింటికి పది వేలు ఇస్తామని ఇచ్చారా అని ఎమ్మెల్యే నాయిని నిలదీశారు. అసలు బీఆర్ఎస్ కు వరంగల్ గురించి మాట్లాడే ఆర్హత లేదన్నారు.
also read : తీన్మార్ మల్లన్న ప్రజా సమస్యలపై మాట్లాడుతరు.. ఆయనకే మా మద్దతు : అలుగుపల్లి నర్సిరెడ్డి