కేటీఆర్ తిత్తి తీయాలని సీఎంకు చెప్పా: వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

కేటీఆర్ తిత్తి తీయాలని సీఎంకు చెప్పా: వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

వరంగల్: కేటీఆర్ తిత్తి తీయాలని సీఎంకు చెప్పానని వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రెస్మీట్లో చెప్పారు. 2014లో మీ ప్రభుత్వం చేసిన సకల జనుల సర్వే రిపోర్ట్ ఏమైందని కేటీఆర్ ను ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్రశ్నించే స్వేచ్ఛను హరించింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని, ఇందిరా పార్కు ధర్నా చౌక్ ఎత్తేసింది మీరు కాదా అని నిలదీశారు. బీఆర్ఎస్ పథకాలు అన్నీ దోపిడీ చేసేందుకే తీసుకొచ్చారని దుయ్యబట్టారు. 

ముఖ్యమంత్రిని ఔలే అని సంభోదించడాన్ని  నాయిని ఖండించారు. కేటీఆర్ ఔలా గాళ్ల సంఘానికి అధ్యక్షుడని, ఒక ఉల్ఫా అని వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నిప్పులు చెరిగారు. మీరు పదేళ్లలో చేయలేని పనులను మేము చేస్తున్నామని, కబ్జా చేసిన పార్టీ కార్యాలయంలో కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టడానికి సిగ్గుండాలని నాయిని మండిపడ్డారు.

వరంగల్కు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని, వరంగల్ అభివృద్ధిపై చర్చకు రావాలని వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కేటీఆర్కు సవాల్ విసిరారు. ఐదేళ్లు మహిళలకు మంత్రి వర్గంలో చోటివవ్వని మీరు, మా ప్రభుత్వం గురించి మాట్లాడతారా అని ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. 

Also Read : మాలల గౌరవం తగ్గించే ప్రయత్నం జరుగుతోంది

కులగణనపై ప్రజలను రెచ్చగొట్టే వారిపై దేశద్రోహం కేసు పెట్టాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. రూపాయి ట్యాక్స్ కట్టకుండా వరంగల్లో బీఆర్ఎస్ కార్యాలయం నిర్వహిస్తున్నారని వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రెస్మీట్లో వ్యాఖ్యలు చేశారు.