జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నా

 జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నా

గ్రేటర్‍ వరంగల్‍, వెలుగు: గ్రేటర్‍ వరంగల్‍ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తాను కట్టుబడి ఉన్నానని వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి అన్నారు. గురువారం ప్రెస్‍ క్లబ్‍ స్పోర్ట్స్​మీట్‍ _2024 బహుమతుల ప్రదాన కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‍రెడ్డి, వరంగల్‍ మాజీ మేయర్‍ ఎర్రబెల్లి స్వర్ణతో కలిసి ఆయన పాల్గొన్నారు. రూ.10 లక్షలతో చేపడుతున్న క్లబ్‍ ప్రహరీ నిర్మాణ పనులకు వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ జర్నలిస్టుల సహకారంతో పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానన్నారు.

రేవూరి మాట్లాడుతూ సమాజ అభ్యున్నతికి పనిచేస్తున్న జర్నలిస్టుల సహకారంవల్లే తాను 30 ఏండ్లుగా రాజకీయాల్లో రాణిస్తున్నట్లు తెలిపారు. స్వర్ణ మాట్లాడుతూ తాను నగర మేయర్‍గా ఉన్న సమయంలో అందుబాటులో ఉన్న పేద జర్నలిస్టులందరికీ బీపీఎల్‍ కింద ఇండ్ల స్థలాలు కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు.

 ప్రెస్‍ క్లబ్ అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ జర్నలిస్టులకు త్వరితగతిన ఇండ్ల స్థలాలు అందించేలా చూసి, కాజీపేటలో మీడియా పాయింట్‍ భవన నిర్మాణానికి 500 గజాల స్థలం, నిర్మాణ సాయం అందించాలని కోరారు. అనంతరం గెలుపొందినవారికి అతిథులు బహమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రెస్‍ క్లబ్‍ బాధ్యులు, వివిధ యూనియన్ల నేతలు తదితరులు పాల్గొన్నారు.