సీఎం రేవంత్ పై అభిమానం చాటుకున్న వరంగల్ మహిళ.. దారాలతో ఎంబ్రాయిడరీ ఫోటో..

సీఎం రేవంత్ రెడ్డిపై తన అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకుంది వరంగల్ కు చెందిన మహిళ. జిల్లాల్లోని వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన కొంగ రజిత అనే మహిళ దాదాపు ఆరు గంటల పాటు శ్రమించి.. ఎంబ్రాయిడింగ్ డిజైన్ తో సీఎం చిత్రపటాన్ని తయారు చేసింది. మంగళవారం ( నవంబర్ 18, 2024 ) నాడు వరంగల్ జిల్లాలోపర్యటించనున్న సీఎం రేవంత్ ను కలిసి ఈ ఫోటోను ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలిపారు రజిత.

సీఎం పర్యటన సందర్బంగా స్థానిక కాళోజి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ఎంబ్రాయిడింగ్ డిజైన్ బ్లౌజ్ స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. వరంగల్ పర్యటన సందర్బంగా సీఎంకు గుర్తుగా తాను డిజైన్ చేసిన ఫోటోను ఇవ్వనున్నట్లు తెలిపారు రజిత. ఇదిలా ఉండగా.. మంగళవారం ( నవంబర్ 18, 2024 ) నాడు వరంగల్ లో జరగనున్న ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాల్లో భాగంగా నిర్వహించే  వేడుకల్లో సీఎం రేవంత్ పాల్గొననున్నారు.