బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం

బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం

హనుమకొండ సిటీ, వెలుగు: హనుమకొండ నగరంలోని 57వ డివిజన్ కుడా కాలనీలో రూ.19 లక్షలతో నిర్మించనున్న బ్రిడ్జి నిర్మాణ పనులను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సోమవారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం ఆయన స్థానిక నాయకులతో కలిసి కాలనీ తిరిగి అక్కడ పరిసరాలను పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బంక సరళ, కార్పొరేటర్ నల్లా సుధాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బంక సంపత్ యాదవ్, నాయిని లక్ష్మారెడ్డి, డివిజన్ అధ్యక్షుడు బంక సతీశ్, నాయకులు ఉన్నారు.