కామారెడ్డి, వెలుగు: గ్రామ పంచాయతీల వార్డుల వారీగా ఓటర్ల లిస్ట్‌ను స్టేట్‌ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో ఆఫీసర్లు శుక్రవారం రిలీజ్ చేశారు. కామారెడ్డి జిల్లాలోని మొత్తం 535 గ్రామ పంచాయతీల్లో 6,36,300 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళలు 3,29,747 మంది, పురుషులు 3,06,538 మంది, ఇతరులు 15 మంది ఉన్నారు. పంచాయతీ , ఎంపీడీవో, కలెక్టరేట్ ఆఫీసు నోటీసు బోర్డుల్లో లిస్ట్ ఉంచారు. ఈ ఏడాది ఫిబ్రవరి 22న ప్రచురించిన అసెంబ్లీ నియోజక వర్గాల పోలింగ్ కేంద్రాల ఓటర్ లిస్ట్‌ను ప్రామాణికంగా తీసుకొని పంచాయతీ ఓటర్ల లిస్ట్‌ను తయారు చేశారు.
వార్డుల వారీగా ప్రకటించిన లిస్ట్‌లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 14 నుంచి 18 వరకు పంచాయతీ సెక్రటరీలకు తెలియజేయాలని జిల్లా పంచాయతీ ఆఫీసర్ శ్రీనివాస్‌రావు తెలిపారు. 19న మండల స్థాయిలో పొలిటికల్పార్టీల ప్రతినిధులతో మీటింగ్ ఉంటుందన్నారు. అభ్యంతరాలు పరిశీలించిన తర్వాత ఈనెల 28న ఫైనల్లిస్ట్ప్రకటిస్తామన్నారు.