- సమస్యలు పరిష్కరించాలంటూ అధికారులను నిలదీశారు
హుజూరాబాద్, వెలుగు : తమ వార్డుల్లోని సమస్యలు పరిష్కరించాలంటూ అధికారులను హుజూరాబాద్ పట్టణ ప్రజలు నిలదీశారు. మున్సిపల్ ఆఫీస్‌లో మంగళవారం కౌన్సిల్ మీటింగ్ నిర్వహించారు. మీటింగ్ జరుగుతుండగా 14, 24 వార్డులకు చెందిన ప్రజలు మీటింగ్‌లోకి చొచ్చుకొచ్చారు. తమ సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదంటూ అధికారులను నిలదీశారు. సమస్య పరిష్కరిస్తామని చైర్‌పర్సన్ గందె రాధిక ఆందోళనకారులను శాంతింపజేశారు.