సికింద్రాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ లో నేటి నుంచి వార్డు పాలన మొదలుకానుంది. పాలన వికేంద్రీకరణలో భాగంగా వార్డు ఆఫీసులు అందుబాటులోకి రానున్నాయి. వార్డు అధికారితోపాటు వార్డుకు 10 మంది చొప్పున 150 వార్డుల్లో 1,500 మంది అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు.
ఉదయం 8.30 గంటలకు కాచిగూడ వార్డు ఆఫీసును మంత్రి కేటీఆర్, అమీర్ పేట బీకేగూడలో చీఫ్ సెక్రటరీ శాంతకుమారి, మోండా మార్కెట్, రెజిమెంటల్ బజార్, తాళ్ల బస్తీ, బేగంబజార్ లోని ఆఫీసులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించనున్నారు. బంజారాహిల్స్, సీఎంటీఈఎస్, హిమాయత్ నగర్ మెల్ కోటిపార్క్, ఎల్బీనగర్ లింగోజిగూడ, రామంతాపూర్ వివేక నగర్ వార్డు ఆఫీసులను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించనున్నారు.