కుట్టు మిషన్ల పంపిణీ :ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

కుట్టు మిషన్ల పంపిణీ :ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

వర్దన్నపేట(ఐనవోలు), వెలుగు: హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం నందనంలో సిరి స్వచ్ఛంద సంస్థ, మిషన్ శక్తి మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో 100 రోజులు కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేస్తున్న వారికి గురువారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.  అనంతరం కార్యకర్తలు పోషణ అభియాన్ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, పార్టీ గ్రామాధ్యక్షుడు బండి సంపత్ గౌడ్, మాజీ సర్పంచ్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.